telugu navyamedia
సినిమా వార్తలు

మే 12న రిలీజ్ కానున్న “కళ్యాణమస్తు” చిత్రం

శేఖర్ అయాన్ వర్మ, వైభవి రావ్ హీరో హీరోయిన్లుగా ఒ.సాయి దర్శకత్వంలో చేస్తున్న సినిమా “కళ్యాణమస్తు”. ఇదివరకే ఈ లవ్ & యాక్షన్ చిత్రం నుండి వచ్చిన ప్రతి కంటెంట్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

 

ప్రస్తుతం ఈ చిత్రం నుండి వేసవి కాలం అనే పాటను రిలీజ్ చేసింది చిత్రబృందం. అలరాజు లిరిక్స్ అందించిన ఈ పాటను యాజిన్ నజీర్, అదితి భావరాజు ఆలపించారు.
“నీ జాతలో నీడల్లే ఉండనా కడదాకా
కన్నీరు అన్నదే రానీక
యేం మాయనో నడిపింది నన్నిలా నీదాక
అడుగైన దూరమే కానింకా” అనే పాటలోని చరణాలు ఆకట్టుకుంటున్నాయి.

ఒ.సాయి దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాను బోయపాటి రఘుబాబు నిర్మించారు.R.R.ధ్రువన్ సంగీతం అందించిన ఈ సినిమాకు మల్లికార్జున్ నరగాని సినిమాటోగ్రఫీ అందించారు. “కళ్యాణమస్తు” సినిమాను మే 12 రిలీజ్ చేయనున్నారు చిత్రబృంధం.

నటీనటులు:
శేఖర్ వర్మ, వైభవి రావ్
సాంకేతిక నిపుణులు:
దర్శకత్వం: ఒ.సాయి,
నిర్మాత: బోయపాటి రఘుబాబు,
కెమెరామెన్: మల్లికార్జున్ నారగని,
సంగీతం: ఆర్.ఆర్.ధ్రువన్
పి.ఆర్.ఓ: ఏలూరు శ్రీను

Related posts