దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తై 76వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా తెలంగాణ ప్రజలంతా సామూహిక జాతీయ గీతాలాపన జనగణమన పాడాలని రాష్ట్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది.
ఈ ఉదయం 11.30 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా, హైదరాబాద్లోని ప్రధాన కూడళ్లలో సామూహిక గీతాలాపనకు అన్ని ఏర్పాట్లు చేయాలని సీఎస్ అధికారులను ఇప్పటికే ఆదేశించారు. కాసేపట్లో జాతీయ గీతాలాపన ప్రారంభమవుతుంది.
ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ హైదరాబాద్ లోని అబిడ్స్ లోని జనరల్ పోస్టాఫీస్ సర్కిల్ వద్ద నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో జరిగిన సామూహిక జాతీయ గీతాలపన కార్యక్రమంలో పాల్గొంటారు.
ఆ సమయంలో హైదరాబాద్లో ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద రెడ్ సిగ్నళ్లు పడనున్నాయి. సరిగ్గా 11.30 గంటలకు వాహనదారులు ఎక్కడికక్కడ వాహనాలను నిలిపేసి కారు లేదా బైక్ నుంచి కిందికి దిగి అందరూ నిలబడాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు
అటవీశాఖాధికారుల పై నా తమ్ముడు దాడి చేయలేదు : టీఆర్ఎస్ ఎమ్మెల్యే కోనప్ప