telugu navyamedia
తెలంగాణ వార్తలు

జగన్ నాయకత్వంలో ఏపీ మరింత అభివృద్ధి చెందాలి : కేటీఆర్

పక్క రాష్ట్రంలో కరెంటు, నీళ్లు లేవని, రోడ్లు అధ్వానంగా ఉన్నాయని ఆంధ్రప్రదేశ్‌ను ఉద్దేశించి తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ర్టాల రాజ‌కీయాలో కాక రేపాయి. మంత్రులు, మాజీ మంత్రులు అంతా కేటీఆర్ పై మాటల తూటాలు పేల్చారు..

ఈ నేపథ్యంలో… మంత్రి కేటీఆర్​ ట్విట్టర్‌ వేదికగా వివరణ ఇచ్చారు. క్రెడాయ్‌ సమావేశంలో అన్యాపదేశంగా చేసిన వ్యాఖ్యలు.. ఏపీలోని తన స్నేహితులకు తెలియకుండానే కొంత బాధ కలిగించి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యల వెనుక ఎలాంటి దురుద్దేశం లేదని.. ఎవరినో బాధపెట్టాలనో, కించపరచాలనో అలా మాట్లాడలేదని స్పష్టం చేశారు.

ఈ మేరకు శుక్రవారం అర్ధరాత్రి సమయంలో మంత్రి కేటీఆర్​ ట్వీట్‌ చేశారు. ఏపీ సీఎం జగన్‌ను సోదర సమానుడిగా భావిస్తున్నానన్న కేటీఆర్‌.. ఆయన నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని మనసారా కోరుకుంటున్నా’ అని ఆయన పేర్కొన్నారు.

Related posts