అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణపై చేసిన వ్యాఖ్యలను జగన్ వెనక్కి తీసుకోవాలని మ్మర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందా కృష్ణమాదిగ డిమాండ్ చేశారు. శనివారం గుంటూరులో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… తన పాదయాత్రకు అనుమతిని ఇవ్వకపోవడం దారుణమని అన్నారు.
పోలీసులతో అణచి వేయాలని చూస్తే… చంద్రబాబుకు పట్టిన గతే జగన్ కు కూడా పడుతుందని చెప్పారు. ఈ నెల 22 నుంచి 27 వరకు అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద దీక్షలు చేపడతామని తెలిపారు. జగన్ పాలన ఎలా ఉండబోతోందో రెండు నెలల్లో తెలిసిపోయిందన్నారు. వాగ్దానాలను నిలబెట్టుకోవడంపై సీఎం జగన్ తన సంకల్పాన్ని ప్రదర్శించాలని అన్నారు.