ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి పశ్చిమ బెంగాల్ లో మూడోసారి అధికారంలోకి రావాలని మమత బెనర్జీ చూస్తున్నది. మార్చి 27వ తేదీ నుంచి ఎన్నికలు ప్రారంభం అవుతాయి. పశ్చిమ బెంగాల్ లో ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న బీజేపీని ఓడించేందుకు మమత అన్ని ఎత్తులను వేస్తున్నది. ఇక ఇదిలా ఉంటె, మమత బెనర్జీకి బెంగాల్ లో కొత్త మిత్రుడు దొరికాడు. బీహార్ ఎన్నికల్లో పోరాటపటిమను ప్రదర్శించి మెప్పించిన ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ తో దోస్తీ కట్టేందుకు మమత సిద్ధం అవుతున్నారు. బెంగాల్ ఎన్నికల్లో కొత్తగా బరిలోకి దిగేందుకు తేజస్వి యాదవ్ సిద్దమైన సంగతి తెలిసిందే. బెంగాల్ లో బీహార్ ప్రజలు అధికంగా ఉన్న ప్రాంతాల నుంచి పోటీ చేయాలని ఆర్జేడీ చూస్తున్నది. 10 నుంచి 12 స్థానాల్లో పోటీ చేసేందుకు తేజస్వి యాధావి సిద్ధమౌతున్నారు. ఈరోజు సాయంత్రం మమత బేజార్జీతో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ భేటీ కాబోతున్నారు. రెండు పార్టీలు పొత్తు పెట్టుకొని బీజేపీని ఓడించాలని చూస్తున్నాయి. అదే విధంగా, సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ సైతం మమత బెనర్జీకి సపోర్ట్ చేస్తుండటం విశేషం.
previous post
next post

