telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, మేము .. ఒకరినొకరు గౌరవించుకున్నాము.. : చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తాను ఒకరికొకరు గౌరవం ఇచ్చిపుచ్చుకున్నామని తెలిపారు. ఎంపీ విజయసాయిరెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి రెండ్రోజులుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ప్రలోభపెట్టారని ఆయన ఆరోపించారు. సభ్యులను భయబ్రాంతులకు గురిచేశారని, తప్పును కప్పిపుచ్చుకునేలా ఎదురుదాడి చేస్తున్నారని మండిపడ్డారు. బిల్లుపై చర్చకు సమయం కూడా ఇవ్వలేదని, అసెంబ్లీలో కనీసం ప్రతిపక్షానికి సమయం ఇవ్వలేదని దుయ్యబట్టారు. సాయంత్రం వరకు మైక్‌ ఇవ్వకుండా చేశారని ధ్వజమెత్తారు.

మండలి చైర్మన్‌కు విచక్షణాధికారం ఉంటుందని ఈ సందర్భంగా చంద్రబాబు మరోసారి గుర్తుచేశారు. వైసీపీ నేతలు నీచమైన రాజకీయాలు చేస్తున్నారని, సభలో ఎమ్మెల్యేలు, మంత్రులు ఏకపక్షంగా దాడి చేశారని ఆయన నిప్పులు చెరిగారు. తమను బయటపడేయాలని సీఎం జగన్, స్పీకర్‌కు చెప్పాడని ఆరోపించారు. ముఖ్యమైన బిల్లుపై లాభనష్టాలు చెప్పడం తమ బాధ్యతని ఆయన పేర్కొన్నారు.

Related posts