కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని కుదిపేసింది. ప్రజల్లో ఎంతటి మార్పు తీసుకొచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కరోనా తీవ్రత పరిశ్రమాలమీద ప్రభావాన్ని చూపించింది. అందులో సినిమా పరిశ్రమ ఒకటి. సినిమా షూటింగ్‌లకు బ్రేక్ పడటంతో వేలది మంది సినీ కార్మికులు రోడ్డున పడ్డారు. ఇప్పుడు కరోనా ప్రభావం తగ్గడంతో సినిమా షూటింగ్‌లన్ని మెల్లగా మొదలవుతున్నాయి.
![]()
అయితే కరోనా వైరస్ ప్రభావంతో మాస్క్, శానిటైజర్ మన జీవితంలో ఓ భాగమయ్యాయి. అసలు మాస్క్ పెట్టుకోకపోతే చాలామందికి ఏదో వెలితిగా అనిపిస్తుంటుంది. కరోనా సమయంలో షూటింగ్ చేయడం చాలా కష్టమని మలయాళీ భామ మాళవిక మోహనన్ అభిప్రా యాన్ని వ్యక్తం చేసింది. ‘షూటింగ్ సమయంలో కఠిన భద్రతా నియమాలు పాటిస్తున్నాం. నటీనటులు తప్పా మిగతా అందరూ విధిగా మాస్కలు ధరిస్తారు.

కానీ మేం కానీ షూట్ చేస్తున్నంతసేపు మాస్క్ తీసేయాల్సి ఉంటుంది. గత ఏడాదిగా మాస్క్ పెట్టుకోవడానికి బాగా అలవాటు పడ్డాం. కానీ ఒక్కసారిగా సెట్లో మాస్క్ తీసేయమంటే నగ్నంగా ఉన్నట్లు అనిపిస్తుంది’ ఈ హాట్ బ్యూటీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ అమ్మడు చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి.

ఇక సినిమాల విషయానికి వస్తే.. పేటా, మాస్టర్ చిత్రాలతో గుర్తింపు పొందిన మాళవిక ప్రస్తుతం కార్తీక్ నరేన్ దర్శకత్వంలో మారన్ చిత్రంలో నటిస్తుంది. అంతేకాకుండా ధనుష్ చిత్రంలో లీడ్ రోల్ పోషిస్తుంది. ఇది వరకే విజయ్ దేవరకొండతో ఓ సినిమాలో హీరోయిన్‌గా అవకాశం పొందినా కొన్ని కారణాల వల్ల ఆ చిత్రం పట్టాలెక్కలేదు.
![Malavika Mohanan Photos [HD]: Latest Images, Pictures, Stills of Malavika Mohanan - FilmiBeat](https://www.filmibeat.com/ph-big/2021/08/malavika-mohanan_16297860212.jpg)
అలాగే ఇటీవల దళపతి విజయ్ నటించిన మాస్టర్ సినిమాలో హీరోయిన్‌గా నటిచింది ఈ బ్యూటీ. అయితే ప్రస్తుతం టాలీవుడ్ నుంచి చాలా ఆఫర్లు వస్తున్నాయిని, త్వరలోనే తెలుగులో ఎంట్రీ ఇస్తానని వెల్లడించింది.

