ఈ ఘటన చైనాలోని ఝొంజియాంగ్ ప్రావిన్స్‌లోని లిషుయ్‌లో జరిగింది. పాన్ అనే వ్యక్తి పీకలదాకా తాగి ఇంటికి రావడంతో భార్య అతనికి నాలుగు చివాట్లు వేసింది. దీంతో అలిగిన పాన్ వెంటనే ఇంటిని వదిలి రోడ్డు మీదకు వచ్చాడు తాగుతూనే… అసలు రోడ్డుపై రద్దీ ఎక్కువగా ఉంది. ఇతనేమో తాగుతూ, తూలుతూ రోడ్డు వైపు వెళ్ళాడు. దీంతో అతన్ని తీసుకురావడానికి అతని భార్య వచ్చింది. ఇంటికి వచ్చేసేయమని భర్తను అడిగింది. అతను రావడానికి ఒప్పుకోలేదు. దీంతో భర్తను లాక్కెళ్ళే ప్రయత్నం చేసిందా భార్య. అయినా ఆ తాగుబోతు మొండిగా రానని చెప్పి వచ్చిపోయే వాహనాలకు అడ్డుగా నిలబడ్డాడు. దీంతో కొన్ని వాహనాలు అతన్ని చూసి తప్పుకుని పక్కనుంచి వెళ్లిపోయాయి. కానీ ఒక వాహనం మాత్రం ఎంత స్పీడ్ గా వచ్చిందో అంతే స్పీడ్ గా అతన్ని గుద్దేసి అంతే వేగంగా వెళ్ళిపోయింది. దీంతో అక్కడే ఉన్న భార్య షాక్ కు గురైంది. వెంటనే తేరుకుని తన భర్తను ఆసుపత్రిలో చేర్పించింది. పాన్ తలకు, ఛాతికీ తీవ్ర గాయాలయ్యాయి. చావు తప్పి కన్ను లొట్ట పోవడం అంటే ఇదే కాబోలు.
previous post

