telugu navyamedia
సామాజిక

దీపావళి జ‌రుపుకునే విధానం..

దీపావళి పండుగ శ్విజ బహుళ చతుర్దశి అమావాస్య‌ నాడు వస్తుంది. ఈసారి దీపావళి నవంబర్ 4, గురువారం జరుపుకోనున్నారు. రకరకాల పిండి వంటలు తయారుచేసి వినాయకుడు, లక్ష్మిదేవిని పూజిస్తారు. లక్ష్మిదేవి సంపద, వైభవానికి మూలం. లక్ష్మిదేవి నివసించే ఇంట్లో సంపద, ఆనందానికి లోటు ఉండదని ప్రజలు విశ్వసిస్తారు. దీపావళి రోజు లక్ష్మీదేవి భూమిని దర్శించడానికి వస్తుందని నమ్ముతారు. అటువంటి పరిస్థితిలో ప్రతి ఒక్కరూ లక్ష్మిదేవి ఆశీర్వాదం పొందాలని కోరుకుంటారు. అంతేకాదు ఆమె రాక కోసం ఎదురుచూస్తారు. దీపావళి రోజు శ్రీమహాలక్ష్మికి పూజ చేసి శ్రీసూక్తము గాని, లక్ష్మీసహస్రనామ స్తోత్రం కానీ, అష్టోత్రంకానీ చేసుకోవటంవల్ల లక్ష్మీ కటాక్ష్మము లభిస్తుంద‌ట‌.

Diwali 2021: Know the Significance of 13 Diyas Used on Dhanteras

దీపావళి రోజు పాటించ‌వ‌ల‌సిన నియ‌మాలు…

దీపావళి రోజు సూర్యోదయానికి ముందు, రాత్రి వేకువజామున‌ నువ్వులనూనెతో తలంటు పోసుకోవాలి. ఇలా చేయడంలో చాలా విశేషం వుందిట. దీపావళి పర్వదినాలలోనువ్వుల నూనెలో లక్ష్మి దేవి ఉంటుంద‌ని న‌మ్మ‌కం.. అలాగే నదులు, చెరువులు, బావులు, కాలువలు, వంటి అన్నిజలవనరులలోకి గంగాదేవి ఆ రోజుల్లో ప్రవేశిస్తుందిట. నువ్వులనునేతో అభ్యంగనస్నానం చెయ్యడం వల్ల దారిద్ర్యం తొలగి గంగాస్నాన చేసినంత ఫ‌లం ల‌భిస్తుంద‌ట‌.

నువ్వుల నూనె దీపాలతో శుభం..

దీపావళి రోజున ఇంటిని దీపాలతో అలంకరిస్తారు. మట్టి ప్రమిదలు, నువ్వుల నూనె వాడటం మంచిది. లక్ష్మీదేవికి ఇష్టమైన నువ్వుల నూనె, తో ఆవు నేతితో దీపాలు వెలిగిస్తే అమ్మ అనుగ్రహం లభిస్తుంది. దీపావళి రోజున లక్ష్మీపూజతో తమ వ్యాపారం వృద్ధి చెందుతుందని వ్యాపారులు నమ్ముతారు.

దీపావ‌ళి రోజు ప్రజలు తమ ఇంటిని పువ్వులు, దీపాలతో అలంకరిస్తారు. ఈ విధంగా అమావాస్య రాత్రి కూడా వెలుగులతో ప్రకాశిస్తుంది. దీపావళి పండుగ వాస్తవానికి చీకటిపై కాంతి విజయాన్ని సూచిస్తుంది. లక్ష్మిదేవి ఇంటిలో స్థిరంగా ఉండాలంటే పూజ తర్వాత కొన్ని ప్రత్యేక ప్రదేశాలలో దీపాలను వెలిగించాలి. అలాగే దీపావళి రోజున పితృదేవతలు తమతమ సంతానం ఇంటిని దర్సిస్తారట. వారికి మనం పెట్టె దీపాలే దారి చుపిస్తాయట.

Do this on Diwali, luck will shine overnight - MyRatna Blog

దీపావళి రోజు ముఖ్యంగా ఐదు ప్రదేశాలలో దీపాలు పెట్టాలట‌..అవేంటో తెలుసుకుందాం..

1. దీపావళి రోజు రాత్రి ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఖచ్చితంగా దీపం వెలిగించాలి. లక్ష్మిదేవి ఇంట్లోకి ప్రవేశించే ప్రదేశం ఇది. ఈ ప్రదేశాన్ని పువ్వులు మొదంలైన వాటితో చక్కగా అలంకరించాలి.

2. దీపావళి రోజు రాత్రి స్టోర్ హౌస్‌( ధాన్యపుకొట్టు)లో ఖచ్చితంగా దీపం వెలిగించాలి. స్టోర్ హౌస్‌లో ధాన్యాలు మొదలైనవి ఉంచుతారు కనుక లక్ష్మీదేవి సంతోషిస్తుందని దీని వల్ల ఇంట్లో ఎప్పుడూ ఆహార కొరత ఉండదని చెబుతారు.

3.నీరు లేకుండా జీవితం సాధ్యం కాదు. అందుచేత కుళాయి, బావి లేదా మరేదైనా నీటి వనరు ఉన్నచోట దీపావళి రోజు రాత్రి పూజ చేసిన తర్వాత దీపం పెట్టాలి.

4. రావి చెట్టులో 33 వర్గాల దేవతలు ఉంటారు. కాబట్టి ఈ చెట్టు దగ్గర దీపం పెట్టాలి. విష్ణువు స్వయంగా రావి చెట్టులో నివసిస్తాడని నమ్ముతారు. ఆయనను ఆరాధించడం వల్ల లక్ష్మీ దేవి చాలా సంతోషిస్తుంది.

5. ప్ర‌తీ ఇంటికి వంటి గ‌ది చాలా ప్రాముఖ్య‌మైన‌ది..అక్క‌డే ల‌క్ష్మీదేవి కొలువై ఉంటాది. వంట చేసే పొయ్యి ల‌క్ష్మీ అని అంటారు. దాని మీద‌నే ..ఎన్నో ర‌కాలు వంట‌లు వండుతారు.. అన్నం ని ల‌క్ష్మీదేవితో పొల్చుతారు.. అన్నం ప‌ర‌బ్ర‌హ్మా స్వ‌రూపం అంటారు..అందుకే వంట‌గ‌దిలో దీపం పెడితే మంచిదని పెద్ద‌లు అంటారు.

 

Related posts