బౌలర్ గా బ్యాట్స్‌మెన్‌కి చుక్కలు చూపించిన బౌలర్ హర్భజన్ సింగ్. టీమిండియాకి ఎన్నో విజయాలు అందించిన హర్భజన్ సింగ్ సుదీర్ఘ క్రికెట్ జీవితానికి గుడ్ బై చెప్పి ప్రస్తుతం వెండితెరపై అలరించేందుకు సిద్ధమయ్యాడు. తమిళంలో ‘ఫ్రెండ్‌షిప్’ అనే టైటిల్‌తో సినిమా చేస్తున్నాడు. ఇందులో బిగ్ బాస్ ఫేమ్ లోస్లియా మరియ నేసన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి జాన్ పాల్ రాజ్, శ్యామ్ సూర్య దర్శకత్వం వహిస్తున్నారు. సీన్‌టొ స్టూడియోస్, సినీ మాస్ స్టూడియోస్ పతాకాలపై జెపిఆర్, స్టాలిన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సమ్మర్‌లో చిత్రాన్ని విడుదల చేయాలని భావిస్తుండగా, చిత్రానికి సంబంధించి విడుదలైన ఫస్ట్ లుక్ ప్రేక్షకులలో ఆసక్తి పెంచుతుంది. పోస్టర్‌లో రెండు చేతులకి ఒకే సంకెళ్లు వేసి ఉండడం గమినిస్తుంటే ఈ మూవీ వెరైటీ కథనంతో రూపొందుతుందని అర్ధమవుతుంది. త్వరలో చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.
previous post

