telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

వి : ఆసక్తికరంగా నాని, సుధీర్ బాబు లుక్స్

V

నాని, సుధీర్ బాబు పాత్ర‌ల‌లో మోహ‌న్ కృష్ణ ఇంద్ర‌గంటి తెర‌కెక్కిస్తున్న చిత్రం “వి”. థ్రిల్ల‌ర్ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించి విడుద‌లైన లుక్స్ ప్రేక్ష‌కుల‌లో ఆస‌క్తిని క‌లిగిస్తున్నాయి. తాజాగా టీజ‌ర్ రిలీజ్ డేట్ ప్ర‌క‌టిస్తూ పోస్ట‌ర్ విడుద‌ల చేశారు. ఇందులో నాని, సుధీర్ బాబు సీరియ‌స్ లుక్‌లో క‌నిపిస్తున్నారు. ఇందులో ఎవ‌రు నెగెటివ్ రోల్ పోషిస్తున్నార‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. మార్చి 25న విడుద‌ల కానున్న ఈ చిత్ర టీజ‌ర్ ఫిబ్ర‌వ‌రి 17న విడుద‌ల కానుంది. ఈ చిత్ర టీజ‌ర్ ప్రేక్ష‌కుల‌కి పిచ్చెక్కించ‌డం ఖాయ‌మ‌ని మేక‌ర్స్ అంటున్నారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంలో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు. నివేదా థామస్, అదితి రావ్ హైదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

Related posts