దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి. రోజు రోజుకు రికార్డు స్థాయి లో కేసులు పెరుగుతున్నాయి. తాజా కేసులతో దేశంలో 1.15 కోట్లు దాటాయి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య. గడచిన 24 గంటలలో 43,846 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా…కరోనా వల్ల మొత్తం 197 మంది మృతి చెందారు. ఇక గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 22,956 డిశ్ఛార్జ్ అయ్యారు. దేశంలో ఇప్పటివరకు నమోదయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,15,99,130 కాగా ….దేశ వ్యాప్తం గా యాక్టీవ్ కేసులు 3,09,087 గా ఉన్నాయి. ఇక మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కూడా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్, ఇండోర్, జబల్పూర్ నగరాల్లో ఆదివారం రోజున లాక్డౌన్ను విధించారు. మూడు రోజుల క్రితమే ఈ ప్రకటన చేశారు. దీంతో శనివారం రాత్రి నుంచి భోపాల్, ఇండోర్, జబల్పూర్ నగరాలు నిశ్శబ్ధమయ్యాయి. ఇక నుంచి ఆదివారం రోజున ఈ మూడు నగరాల్లో లాక్డౌన్ను అమలు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు లాక్డౌన్ కొనసాగుతుందని ప్రభుత్వం పేర్కొంది.
next post

