లాక్‌డౌన్ నిబంధనలు మరికొన్ని రోజులు మాత్రమేనని, అప్పటివరకూ సంయమనం పాటిద్దామని ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతం సవాంగ్ పేర్కొన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ… కరోనాను నిరోధించేందుకు పోలీసులు నిరంతరం పనిచేస్తున్నారని, వారి సేవలను ప్రజలు గుర్తిస్తున్నారని చెప్పారు. ఇదే స్ఫూర్తితో ప్ర్జలు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నట్లు చెప్పారు.
ఆంధ్రా లయోలా కాలేజీ ఆధ్వర్యంలో పోలీసులకు పోషక ఆహారం పంపిణీ చేశారు. కాలేజీ యాజమాన్యం 4 వేల గుడ్లను అందించింది. పోలీసుల సేవలను గుర్తిస్తున్నందుకు డీజీపీ గౌతమ్ సవాంగ్ ధన్యవాదాలు తెలిపారు. గుంటూరు, విజయవాడ పోలీసులు మరింత కష్టపడి పనిచేస్తున్నారని తెలిపారు. గుంటూరులో 30 మంది కరోనా బాధితులు ఉండగా, కృష్ణా జిల్లాలో 28 మందికి కరోనా సోకింది.
ప్రజలు మార్పు కోరుకున్నారు: గంటా శ్రీనివాస్