ఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీకి షాక్ తగిలింది. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ జనసేన పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు జనసేనాని పవన్ కల్యాణ్‌కు ఆయన లేఖ రాశారు. పూర్తి జీవితం ప్రజాసేవకే అంకితం చేస్తూ.. సినిమాల్లో ఇక నటించబోనని చెప్పిన పవన్ మాటమార్చారని లక్ష్మీనారాయణ ఆరోపించారు. మళ్లీ సినిమాల్లో నటించాలని పవన్ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన తప్పుబట్టారు.
పవన్‌లో నిలకడైన విధి విధానాలు లేవని తెలుస్తోందని పవన్‌ను ఉద్దేశించి లక్ష్మీనారాయణ లేఖలో విమర్శించారు. అందుకే జనసేన నుంచి నిష్క్రమించాలని నిర్ణయించుకున్నానని తెలిపారు.


నేను బతికిఉండగా పోలవరం పూర్తవుతుందనే నమ్మకం లేదు..