“వకీల్ సాబ్” చిత్రంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కరోనా వల్ల ఆగిపోయింది. ఇక ఈ సినిమా తరువాత క్రిష్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ నటించే చిత్రం టైటిల్ పట్ల కూడా అభిమానుల్లో ఎంతో ఆసక్తి, కుతూహలం నెలకొన్నాయి. ఇక ఈ చిత్రం టైటిల్ని పవన్ జన్మదినమైన సెప్టెంబర్ 2న ప్రకటించడానికి దర్శకుడు క్రిష్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. టైటిల్ అనౌన్స్ మెంట్ కి హీరో బర్త్ డేను మించిన రోజు మరొకటి ఉండదని, ప్రేక్షకులలోకి బాగా చొచ్చుకుపోతుందని భావిస్తున్నారు. ఈ చిత్రం కోసం ‘బందిపోటు’, ‘గజదొంగ’ అనే పేర్లు పరిశీలిస్తున్నట్టు అప్పుడే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ చిత్రాన్ని స్వాతంత్ర్యం పూర్వం నాటి కథతో పిరీడ్ మూవీగా నిర్మిస్తున్నారు. ఇదిలావుంచితే, మరోపక్క పవన్ నటిస్తున్న ‘వకీల్ సాబ్’ చిత్రం బ్యాలెన్స్ చిత్రీకరణ వచ్చే నెలలో ప్రారంభం కావచ్చని సమాచారం.
previous post

