హైద్రాబాద్ పాతబస్తీ లాల్ దర్వాజ బోనాల వేడుకలు నిరాడంబరంగా ప్రారంభమయ్యాయి. ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు అర్చకులు అమ్మవారికి జల కడవ సమర్పించారు. సాయంత్రం 6 గంటలకు అమ్మవారి శాంతి కళ్యాణం జరగనుంది. అక్కన్న మాదన్న ఆలయంతో పాటు అన్ని పురాతన అమ్మవారి ఆలయాల్లో పూజలు జరుగుతున్నాయి.
బోనాల పండుగ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ లక్మీనారాయణ గౌడ్ కుటుంబ సభ్యులు అమ్మవారికి బోనం సమర్పించారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా భక్తులు లేకుండ, కేవలం ఆలయ కమిటీ సభ్యులతోనే బోనాల వేడుకలను అధికారులు నిర్వహిస్తున్నారు.


తెలంగాణలో కాంగ్రెస్ పని అయిపోయింది: ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి