telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

కరోనా సోకని దీవులు ఇవే…

ఈ ఏడాది ఆరంభం నుండి కరోనా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంది. అయితే కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్న దేశాల్లో ఇండియా రెండో స్థానంలో ఉన్నది.  ఇండియాలో ఇప్పటికే 95 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి.  కరోనాకు ముందు వరకు దేశంలో పర్యాటక ప్రదేశాలు టూరిస్టులతో నిత్యం కిటకిటలాడుతుండేవి.  కరోనా దెబ్బకు మొత్తం మూతపడ్డాయి.  ఇప్పుడిప్పుడే కరోనా నుంచి కోలుకున్నాక తిరిగి పర్యాటక ప్రాంతాలను తెరుస్తున్నారు. కరోనా దెబ్బకు భయపడి పెద్దగా ఎవరూ బయటకు రావడం లేదు.  మన దేశంలో కరోనా సోకని ప్రదేశం ఏదైనా ఉన్నదా అంటే లేదని అంటాం.  మనదేశంలో కరోనా సోకని పర్యాటక ప్రదేశం ఒకటి ఉంది.  అదే లక్షద్వీప్.  దేశంలోని కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒకటి ఇది.  అరేబియా సముద్రంలో ఉన్న ఈ దీవుల్లోకి కరోనా వ్యాపించలేదు.  ప్రస్తుతానికి ఇదొక్కటే సురక్షితమైన దీవులు.  కరోనా తరువాత ఆ దీవులు క్రమంగా తెరుచుకుంటున్నాయి.  ఈ దీవులకు వచ్చే టూరిస్టుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతున్నది. దాంతో కరోనా ఇక్కడికి కూడా వచ్చే ప్రమాద పెరగనునట్లు చెబుతున్నారు.

Related posts