కరోనా వైరస్ సోకిన వారికి హైదరాబాద్ లోని గాంధీ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇప్పటికే చికిత్స అందిస్తున్నారు. వార్డులన్నీ రోగులతో నిండిపోవడంతో నగరంలోని మరో ఆసుపత్రిని కూడా ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానుంది. ఈ వైరస్ బారిన పడ్డ వారికి కింగ్ కోఠిలోని ఆసుపత్రిలో చికిత్స అందించేందుకు సిద్ధం చేస్తున్నట్టు మంత్రి కేటీఆర్ తెలిపారు.
కరోనా బాధితులకు పూర్తి స్థాయిలో చికిత్స అందించేందుకే ఈ ఆసుపత్రి సిద్ధంగా ఉందని తెలిపారు. అధునాతన సౌకర్యాలతో ప్రత్యేకంగా 350 పడకల సామర్థ్యంతో ఈ ఆసుపత్రిని సిద్ధం చేశామని చెప్పారు. కరోనా రోగులకు చికిత్స అందించేందుకు హైదరాబాద్ లో మరో నాలుగు ప్రత్యేక ఆసుపత్రులను కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలిపారు.