తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కాస్త పుంజుకుంది. భువనగిరి లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్ విజయం సాధించింది. టీఆర్‌ఎస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌పై 4,657 ఓట్ల మెజార్టీతో కోమటిరెడ్డి విజయం సాధించారు. . గత అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ నుంచి పోటీ చేసిన కోమటిరెడ్డి భారీ ఓటమిని చవిచూశారు. అయినప్పటికి కాంగ్రెస్ అధిష్టానం కోమటిరెడ్డిపై నమ్మకంతో ఆయనకు భువనగిరి లోక్‌సభ టికెట్ ఇచ్చింది. అధిష్టానం నమ్మకాన్ని నిజం చేస్తూ కోమటిరెడ్డి విజయం సాధించారు.
మల్కాజ్‌గిరి లోక్‌సభ నుంచి రేవంత్ రెడ్డి విజయం సాధించారు. 6270 ఓట్ల మెజార్టీతో తన సమీప ప్రత్యర్థి, టీఆర్ఎస్ అభ్యర్థి రాజశేఖర్ రెడ్డిపై గెలుపొందారు. నల్లగొండలో నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలుపొందారు. తెలంగాణలో మొత్తం మూడు స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. 17 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్.. మూడు స్థానాల్లో గెలుపొందింది. చేవెళ్ల పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు.