ఐపీఎల్ 2021 లో ఈరోజు కోల్‌కత నైట్ రైడర్స్-పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు బ్యాట్స్మెన్స్ ను బాగానే కట్టడి చేసారు కేకేఆర్ బౌలర్లు. కెప్టెన్ రాహుల్ (19) త్వరగా ఔట్ అయిన తర్వాత మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 31 పరుగులు చేసి వెనుదిరిగాడు. ఇక ఆ తర్వాత బ్యాటింగ్ కువచ్చిన వారు అందరూ నిరాశపరిచారు. కానీ చివర్లో క్రిస్ జోర్డాన్ 18 బంతుల్లో 30 పరుగులు చేయడంతో పంజాబ్ జట్టు నిర్ణిత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. ఇక 124 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగ్గిన కేకేఆర్ పంజాబ్ బౌలర్ల దెబ్బకు మొదట తడబడింది. వరుసగా మొదటు మూడు ఓవర్లలో మూడు వికెట్ కోల్పోయిన కోల్‌కత ను తర్వాత కెప్టెన్ మోర్గాన్(47), , రాహుల్ త్రిపాఠి(41) కలిసి ఆదుకున్నారు. అయితే చివర్లో త్రిపాఠి ఔట్ అయిన మోర్గాన్ చివరి వరకు నాట్ ఔట్ గా నిలిచి దినేష్ కార్తీక్ (12) తో కలిసి జట్టుకు 5 వికెట్ల తేడాతో విజయాన్ని కోల్‌కత. అయితే ఈ గెలుపుతో పాయింట్ల పట్టికలో చివర్లో ఉన్న కేకేఆర్ 5వ స్థానానికి చేరుకుంది.
previous post

