telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఐటీ కారిడార్ ఏర్పాటుతో బంగారు భవిష్యత్తు: మంత్రి శ్రీనివాస్ గౌడ్

srinivas goud minister

ఐటీ కారిడార్ ఏర్పాటుతో భావి తరాలకు బంగారు భవిష్యత్తు ఉంటుందని తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఈ రోజు మహబూబ్ నగర్ జిల్లా, ఎదిర వద్ద ఐటీ పార్కు నిర్మాణ పనులకు సంబంధించి ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ఆవిర్భావంతోనే పాలమూరులో అభివృద్ధి ఊపందుకుందని అన్నారు. ఈ ఐటీ కారిడార్ ఏర్పాటుతో జిల్లా నుంచి వలసలు ఆగిపోతాయని అన్నారు.

హైటెక్ సిటీ నమూనాలో భవనం నిర్మిస్తామని, దశల వారీగా అభివృద్ధి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. పాలమూరు వైపు పారిశ్రామిక వేత్తలను ఆకర్షించడానికి కృషిచేస్తామని చెప్పారు. తమ ప్రభుత్వ పథకాలతో పాలమూరు ముందుకు దూసుకుపోతోందని చెప్పారు. పాలమూరును అభివృద్ధిలో ఆదర్శంగా నిలుపుతామని పేర్కొన్నారు. కొంతమంది కోర్టు కేసులతో ఇక్కడ అభివృద్ధిని అడ్డుకోవాలని ప్రయత్నించి విఫలమయ్యారని తెలిపారు.

Related posts