*టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ తమ్మినేని ఆగ్రహం
*మద్యపాన నిషేదానికి చంద్రబాబు తూట్లు పొడిచారు..
*ధరలు తగ్గించాలని చంద్రబాబు ధర్నాలు చేశారు..
*జంగారెడ్డిగూడెంలో సాధారణ మరణాలే..
జంగారెడ్డి గూడెం వరుస మరణాల వ్యవహారంపై అసెంబ్లీలో చర్చకు తెలుగు దేశం పార్టీ సభ్యులు చర్చకు పట్టుపట్టడంతో సభ పలుమార్లు వాయిదా వేశారు.
అయితే ఈ అంశంపై చర్చించాల్సిందేనని టీడీపీ నేతలు పోడియం వద్దకు వచ్చి నినాదాలు చేపట్టారు. సభలో టీడీపీ సభ్యులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని స్పీకర్ తమ్మినేని సీతారాం అసహనం వ్యక్తం చేశారు.
వాయిదా అనంతరం ప్రారంభమైంది. టీడీపీ సభ్యులను ఉద్దేశిస్తూ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. మద్యపాన నిషేధంపై మాట్లాడే హక్కు టీడీపీ సభ్యులకు లేదని మంత్రి కొడాలి నాని అన్నారు.
ఎన్టీఆర్ మద్యపాన నిషేధం అమలు చేస్తే చంద్రబాబు దానికి తూట్లు పొడిచారని మండిపడ్డారు. బెల్ట్ షాపులు తెరిచింది చంద్రబాబే అని కొడాలి నాని ఆరోపించారు.చనిపోయిన వారి ప్రతి ఒక్కరి ఉసురు చంద్రబాబుకు తగులుతుందని అన్నారు
రాష్ట్రంలో మద్యాన్ని ఏరులై పారించిన దుర్మార్గుడు చంద్రబాబు అన్నారు. సీఎం జగన్ బెల్ట్ షాపులు రద్దు చేశారని తెలిపారు.అధికారంలో నుంచి దిగిపోయే ముందు బార్లకు ఐదేళ్లు లైసెన్సులు ఇచ్చిన ఘనత చంద్రబాబుది అంటూ ఎద్దేవా చేశారు.
జంగారెడ్డి గూడెంలో జరిగినవి సాధారణ మరణాలని.. టీడీపీ నేతలు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన నిప్పులు చెరిగారు.
రాజకీయాల్లో ఆడవాళ్లను అడ్డం పెట్టుకున్న సన్నాసి చంద్రబాబు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సభకు అడ్డం పడుతోన్న టీడీపీ సభ్యులను బయటకు పంపాలని స్పీకర్ను మంత్రి కొడాలి నాని కోరారు.
నేను ఎవరి పల్లికీ మోయడానికి రాలేదు..ప్రజలను పల్లికీ ఎక్కించడానికే వచ్చాను..