జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ… ఆదాయంలో కొరత ఏర్పడితే జీఎస్టీ పరిహార చట్టంలోని సెక్షన్ 7(2) ప్రకారం రాష్ట్రాలకు పరిహారాన్ని ప్రతీ రెండు నెలలకు చెల్లించాలి అని తెలిపారు. ఈ పరిహారం తప్పనిసరిగా పరిహార నిధి నుండే చెల్లించాలి. సెస్ తో పాటు, జీఎస్టీ కౌన్సిల్ సిఫారసు చేసే ఇతర మొత్తం నిధులను తప్పనిసరిగా జీఎస్టీ పరిహార నిధిలో జమ చేయాలి అని సూచించారు. ఆప్షన్ 1, ఆప్షన్ 2 కింద పెర్కొన్న రుణాలు ఇతర నిధుల కింద ఉన్నట్లు పరిహార నిధి చట్టం సెక్షన్ 10(1) చెబుతోంది. దీనిపైన జీఎస్టీ కౌన్సిల్ చర్చించ వచ్చు అన్నారు. అయితే ఆప్షన్ 1 లో చెల్లించాల్సిన పరిహారాన్ని లక్ష పది వేల కోట్ల కు, ఆప్షన్ 2 లో లక్ష 83 వేల కోట్లు కు రివైజ్డ్ చేయడం జరిగింది. వీటి మధ్య అంతరం 73 వేల కోట్లు మాత్రమే. ఇదేమి పెద్ద మొత్తం కాదు. ఆప్షన్ 1 లో పేర్కొన్న పరిహారంతో పాటు ఈ 73 వేల కోట్లు చెల్లించాలిఅని పేర్కొన్నారు. ఈ సమావేశంలో చత్తీస్‌గఢ్ మంత్రి చెప్పినట్లు ,జీఎస్టీ పరిహారం చెల్లింపుల కోసం తీసుకునే రుణం ఆర్టికల్ 293 పరిధిలో ఉండదు. దీన్ని తాను సమర్ధిస్తున్నట్లు మంత్రి హరీశ్ రావు చెప్పారు.
previous post

