మహానటి సావిత్రి జీవితం ఆధారంగా తెలుగులో రూపొందిన “మహానటి” చిత్రంలో నటించి తెలుగు ప్రేక్షకులను హృదయాలను కొల్లగొట్టింది కీర్తి సురేష్. అంతేకాదు ఈ సినిమాలో తన నటనకుగానూ నేషనల్ అవార్డు సైతం అందుకుంది. మరో డిఫరెంట్ సినిమాతో తెలుగు ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. తాజాగా “మిస్ ఇండియా” అనే ఫీమేల్ సెంట్రిక్ చిత్రంలో నటిస్తుంది. దీంతో పాటు హిందీ, తమిళంలోను సినిమాలు చేస్తుంది . దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు నిర్మిస్తున్న ఉమెన్ సెంట్రిక్ చిత్రంలో కీర్తి సురేష్ ప్రధాన పాత్ర పోషిస్తుండగా, ఈ చిత్రం రీసెంట్గా సెట్స్‌పైకి వెళ్ళింది. కీర్తి 24వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాకి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చే ప్రణాళికలు వేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో పని చేసే టీం అందరికి గోల్డ్ కాయిన్స్ బహుమతిగా అందించిందట కీర్తి సురేష్. ఆమె గోల్డ్ కాయిన్స్ ఇలా బహుమతిగా ఇవ్వడంతో చిత్ర బృందం చాలా హ్యాపీగా ఫీలైందట. గతంలో పలువురు స్టార్ హీరోలు కూడా ఇలా కాయిన్స్ గిఫ్ట్‌గా అందించగా, ఓ హీరోయిన్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం విశేషం.
previous post
next post

