telugu navyamedia
ట్రెండింగ్ వ్యాపార వార్తలు సామాజిక

హైదరాబాద్ లో .. సేంద్రియ ఉత్పత్తుల మేళ..

natural cultivation produts mela 2019 hyd

ఎటుచూసినా కల్తీ ఉత్పత్తులే దర్శనం ఇస్తున్న తరుణంలో మళ్ళీ సేద్యం సేంద్రియం వైపు మళ్లింది. ఇప్పుడిప్పుడే రైతులు ఈ తరహా వ్యవసాయానికి అడుగులు వేస్తున్నారు. కల్తీ ఉత్పత్తులతో రోగాలు కొనితెచ్చుకోవటం కంటే సేంద్రియ ఉత్పత్తులనే వినియోగదారులు కూడా కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీనిని దృష్టులో పెట్టుకొని మరియు ఆర్గానిక్ రంగంలో ఉన్న మహిళా రైతులు, వ్యాపారవేత్తలకు ప్రోత్సాహం అందించేందుకు ఈనెల 6 నుంచి 10 వరకు మహిళా జాతీయస్థాయి సేంద్రియ మేళా జరుగనున్నది.

శిల్పారామంలో కేంద్ర, రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖలు సంయుక్తంగా 7వ సేంద్రియ ఉత్పత్తుల మేళా-2019 నిర్వహిస్తున్నాయి. ప్రదర్శన వివరాలను మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి ఎం జగదీశ్వర్ వివరించారు. 2015 నుంచి ఈ మేళా నిర్వహిస్తుండగా.. దక్షిణ భారతదేశంలో మొదటిసారిగా హైదరాబాద్‌లో జరుగుతున్నదని నిర్వాహకులు తెలిపారు.

Related posts