రాజకీయ, సామాజిక అంశాల్లో వచ్చిన మార్పులు, రాష్ట్ర ప్రగతి తదితర అంశాలపై తెలంగాణ ఉద్యమకారుడు గోసుల శ్రీనివాస్ యాదవ్ ఎడిటోరియల్ వ్యాసాలతో రూపకల్పన చేసిన ‘సన్ ఆఫ్ ద సాయిల్’ (భూమి పుత్రుడు) పుస్తకాన్ని కేసీఆర్ శుక్రవారం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ… కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టాలన్నారు.
ఉద్యమ శక్తులను మరోసారి పునరేకీకరణ చేసి కార్యక్షేత్రానికి రూపకల్పన చేస్తున్నట్టు చెప్పారు.
ఈ సందర్భంగా ‘సన్ ఆఫ్ సాయిల్’ పుస్తక రచయిత గోసుల శ్రీనివాస్ యాదవ్‌ను కేసీఆర్ ప్రత్యేకంగా అభినందించారు.
తెలంగాణ మలి దశ ఉద్యమంలో, తెలంగాణ ప్రగతిని సాధారణ శైలిలో, ప్రజలకు అర్థమయ్యేలా వివరించారన్నారు.