కరీంనగర్ జిల్లాలో ఐదుగురు విద్యార్థినులు అదృశ్యం అయ్యారు. కేశవపట్నం మండలకేంద్రంలో గల కస్తూరిబా పాఠశాల నుంచి ఐదుగురు విద్యార్థినులు కనిపించకుండా పోయారు. వీరంతా పదో తరగతి చదువుతున్నారు. గడిచిన అర్థరాత్రి నుంచి వీరు కనబడకుండా పోయారు. విద్యార్థినుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మన్నంపల్లి గ్రామానికి చెందిన దుర్గం ఐశ్వర్య(16), తాడికల్‌కు చెందిన కొంకటి రేణుక(15), కరీంపేటకు చెందిన బెజ్జంకి భవాని(16), మంద వెవన్య(15), కాచాపూర్‌కు చెందిన మాతంగి తేజశ్రీ(16). ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విద్యార్థుల ఆచూకీ తెలిసినవారు కేశవపట్నం ఎస్‌ఐ సెల్‌నెంబర్-9440900980, హుజూరాబాద్ రూరల్ సీఐ- 9440795151 నెంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందించాల్సిందిగా పోలీసులు తెలిపారు.

