జమ్ముకశ్మీర్ లోని పజాల్పుర ప్రాంతంలో ఓ ఇంటిలో తలదాచుకున్న ఉగ్రవాదులను భద్రతా దళాలు చుట్టుముట్టాయి. బుధవారం ఉదయం ఆరు గంటల నుంచి భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. కాగా ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు ముష్కరులు మృతి చెందారు.ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆ ప్రాంతంలోని నివాసితులను ఖాళీ చేయించారు. మొబైల్, ఇంటర్నెట్ సేవలను నిలుపు చేశారు.
అనంతరం ఉగ్రవాదుల కోసం గాలింపు చేపట్టారు. ఆ సమయంలో ఎదురుపడిన ఉగ్రవాదులు కాల్పులకు తెగబడడంతో సైన్యం కూడా ఎదురు కాల్పులకు దిగింది. దీంతో ఉగ్రవాదులు ఓ ఇంటిలోకి ప్రవేశించారు. దీన్ని గమనించిన బలగాలు ఇంటిని చుట్టుముట్టి ఉగ్రవాదులను మట్టుబెట్టాయి.


ఆర్టికల్ 257 కింద రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం చర్యలు: యనమల