జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే 370 ఆర్టికల్ ను కేంద్రం రద్దు చేయడానికి ముందు కశ్మీరుకు భద్రతా బలగాలు పెద్ద ఎత్తున మోహరించాయి. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తుగా పలువురు రాజకీయ నాయకులు, వారి అనుచరులు, వేర్పాటువాదులను బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. ఇప్పటి వరకు 400 మందిని అరెస్ట్ చేశారు.
అదుపులోకి తీసుకున్న వారిని ఉంచేందుకు హోటళ్లు, అతిథి గృహాలు, ప్రభుత్వ, ప్రైవేటు భవనాలను తాత్కలిక జైళ్లుగా మార్చేశారు. జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులైన ఒమర్ అబ్దుల్లా, మెహబూబాముఫ్తీలను హరినివాస్‌లోని వేర్వేరు కాటేజీలకు తరలించగా, వేర్పాటువాద నాయకుడు (91) సయ్యద్ అలీషా గిలానీ గృహ నిర్బంధంలో ఉంచారు. తనను కూడా గృహనిర్బంధం చేశారని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా పేర్కొన్నారు.
సచివాలయ వ్యవస్థ వల్లే అనేక సమస్యలు: పురందేశ్వరి