నన్ను మించిన ధనవంతుడు ఈ భూమండలంలో లేడని, నేను లక్ష్మీ దేవి భర్తనంటూ అనంత విష్ణుదేవ వింత వ్యాఖ్యలు చేశారు.
ఒక ఆధార్ కార్డ్ జిరాక్స్ , పది రూపాయలు ఇస్తే పార్టీలో సభ్యత్వం ఇచ్చి..200 గజాల స్థలం ఇస్తామని జై మహాభారత పార్టీ ప్రచారం చేసింది. దీంతో సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రవీంద్రభారతి పక్కన ఓ ప్రైవేట్ భవనం ముందు మహిళలు భారీగా చేరుకున్నారు.
గతంలో తాము దేశమంతా ఎన్నికల్లో పోటీ చేశామని.. తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లో మహిళలను పోటీ చేయిస్తామని.. తాము అధికారంలోకి వస్తే మద్య నిషేధం అమలు చేస్తామని చెప్పారు.
వారంతా తమ పార్టీ సభ్యత్వం తీసుకోవాలని.. ఇందుకోసం రూ. 10 రూపాయలు చెల్లించాలని.. ఒక ఆధార్ కార్డ్ జిరాక్స్ ఇవ్వాలని చెబుతున్నారు. అయితే తాము కచ్చితంగా పేదలకు ఇళ్ల స్థలం ఇస్తామని జై జై మహాభారత నేత అనంత విష్ణు చెబుతున్నారు.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆనంత దేవ విష్ణుపై ఫోకస్ పెట్టారు. మెంబర్ షిప్ ల్యాండ్ ఆఫర్లు..ఆ మాటున ఆధర్ కార్డ్‌ల సేకరణ ఎందుకు ? ఏంటన్న వివారాలపై కూపీ లాగుతున్నారు. అలాగే కేసు నమోదు చేయాలన్న ఆలోచనలో ఉన్నారు.
అయితే ఫిర్యాదులెవరూ చేయకపోవడంతో ఎలా ముందుకెళ్లాలన్న దానిపై న్యాయసలహాలు తీసుకుంటున్నారు. పైనల్‌గా సుమోటోగా కేసు నమోదు చేసి అరెస్ట్ చేస్తారని తెలుస్తోంది.


కేంద్రానికి కేసీఆర్ మద్దతు అవసరం లేకపోవడం సంతోషం: రేణుకా చౌదరి