ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మాట్లాడుతూ వైఎస్ జగన్ డబుల్ స్టాండర్డ్ రాజకీయాలు మరోసారి బయటపడ్డాయి. వక్ఫ్ బిల్లు అంశంలో వైసీపీ ద్వంద్వ వైఖరి ఖండిసున్నా. వక్ఫ్ సవరణ బిల్లును నిన్నటి వరకూ వ్యతిరేకిస్తున్నట్లు వైసీపీ కబుర్లు చెప్పింది అన్నారు .
ఎన్డీఏకు బలం ఉన్న లోక్ సభలో వ్యతిరేకించి కేంద్రానికి కీలకమైన రాజ్యసభలో మాత్రం అనుకూలంగా ఓటేసింది.
జగన్ సూచనలతోనే రాజ్యసభలో ఆ పార్టీ ఎంపీలు వక్ఫ్ బిల్లుకు మద్దతు తెలిపారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఓటింగ్ తర్వాత విప్ జారీతో వైసీపీ డ్రామా ఆడింది అన్నారు.
ఓటింగ్ తర్వాత విప్ లోక్ సభ చరిత్రలోనే లేదంటూ విమర్శలు వస్తున్నాయి. జగన్ తీరును జాతీయ మీడియా ఎండగడుతోంది.
నేను మాట్లాడే ప్రజా సమస్యల కన్నా నేను మాట్లాడే ఇతర అంశాలనే మీడియా హైలెట్ చేస్తోంది. నిన్న కూడా వక్ప్ యాక్ట్ అంశం వదిలిపెట్టి వివేకా హత్య అంశాన్నే మీడియా హైలెట్ చేసింది అన్నారు.
జగన్ వాదనలపై మాట్లాడితే పోలవరం అంశం పక్కకు వెళ్లి మిగిలిన అంశాలు హైలెట్ అవుతున్నాయి. ప్రజా సమస్యలపై మాట్లాడినప్పుడు నాకు కవరేజి ఇవ్వండి.
జగన్ రెడ్డి స్వయంగా ఏంఓయూపై సంతకం పెట్టారు. నా పిల్లలకు ఆస్తి ఇస్తున్నట్లు ఆయనే ప్రకటించారు.
గిప్ట్ డీడ్ ను మా అమ్మ విజయలక్ష్మికి జగన్ చేశారు. గిప్ట్ ఇచ్చి మళ్లీ ఇచ్చిన షేర్లు వెనక్కి ఇవ్వాలని ఆమెపై కేసు వేశారు. తల్లిపై కేసులు వేసిన కొడుకుగా జగన్ రెడ్డి మిగిలిపోతారు అన్నారు.
ఆయన నన్ను ప్రభావితం చేసే స్థాయి దాటిపోయారు. సొంత మేనల్లుడు, మేనకోడలు ఆస్తులు లాక్కుంటున్నారు. వైవీ సుబ్బారెడ్టి, విజయసాయిరెడ్డి వంటి వారిని అడ్డం పెట్టుకుని మా మీద నిందలు వేశారు.
ఆయనకు ఆత్మీయుల కన్నా ఆస్తులే ముఖ్యం అనుకుంటా అని అన్నారు.

