ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై రాష్ట్ర బీజేపీ నేత భానుప్రకాశ్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
జగన్ వెళ్లాల్సింది లండన్ కు కాదని… ఉత్తరప్రదేశ్ కు వెళ్లాలని చెప్పారు. శాంతిభద్రతలను ఎలా కాపాడాలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ నుంచి తెలుసుకోవాలని సూచించారు.
పోలీసులు ఉన్నా లెక్క చేయకుండా… దార్జన్యాలకు పాల్పడే వారిని ఉక్కుపాదంతో అణచివేయాలని అన్నారు. గొడవలకు కర్త, కర్మ, క్రియగా ఉన్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు.
ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేకత స్పష్టంగా కనిపించిందని భానుప్రకాశ్ రెడ్డి తెలిపారు.
ఎంతో ప్రశాంతంగా ఉండే రాష్ట్రాన్ని జగన్ ప్రభుత్వం రావణకాష్టంగా మార్చిందని మండిపడ్డారు.
వైసీపీని నమ్ముకున్న ఎంతో మంది పోలీసు ఉన్నతాధికారులు వారి కెరీర్లో మచ్చ తెచ్చుకున్నారని చెప్పారు.