ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతి పక్ష నేత, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర లో ప్రజలను దగ్గరగా కలుసుకొని వారి సాధకబాధకాలు తెలుసుకున్న విషయం తెలిసిందే. అయితే యాత్ర అనంతరం పార్టీ పటిష్టతపై ద్రుష్టి పెట్టాడు జగన్. దీనితో నేటి నుండి పార్టీలో బూట్ స్థాయి నుండి అన్ని వర్గాల వారితో సమావేశాలు ఏర్పాటు చేశాడు.
వైసీపీ జగన్ నేటి నుంచి ‘సమర శంఖారావం’ పేరుతో వైసీపీ బూత్ స్థాయి కార్యకర్తలు, నేతలతో సమావేశం కానున్నారు. ఈరోజు తిరుపతిలో వైసీపీ బూత్ కమిటీ సభ్యులు, కన్వీనర్లతో జగన్ తొలుత సమావేశమవుతారు. అనంతరం స్థానిక ఓట్లను ప్రభావితం చేయగల తటస్థులతో భేటీ అవుతారు.
నాలుగు రాజధానుల విషయం నాకు తెలియదు: బొత్స