లాక్‌డౌన్ వల్ల చాలామంది సెలెబ్రిటీలు ఇంటిపని, వంటపని చేస్తూ వాటి ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తూ వస్తున్నారు. అయితే ఓ బాలీవుడ్ నటుడు మాత్రం రైతు అవతారం ఎత్తాడు. నటుడు జాకీష్రాఫ్ తన ఫార్మ్‌హౌస్‌లో ఉన్న సమయంలోనే లాక్‌డౌన్ ప్రకటించారు. దీంతో జాకీ అక్కడే చిక్కుకుపోగా అతని కుటుంబం మాత్రం ముంబైలో ఉంది. ఈ సందర్భంగా ఆయన భార్య ఐశా.. జాకీ అక్కడ ఏం చేస్తున్నారన్న విషయాలను వెల్లడించింది. ఒక్కడే ఉంటున్నందుకు ఏమాత్రం బోర్ ఫీల్ అవట్లేదని తెలిపింది. పొలంలోని మొక్కలే అతనికి మంచి కంపెనీ ఇస్తున్నాయని చెప్పుకొచ్చింది. ప్రకృతి పైర గాలులను ఆనందంగా ఆస్వాదిస్తున్నాడని పేర్కొంది. కాగా జాకీ ష్రాఫ్‌కు మొక్కలంటే ఎంతో ఇష్టం. అతని గార్డెన్‌లో సేంద్రీయ కూరగాయలతో పాటు పంటలు కూడా పండిస్తారు. విరివిగా మొక్కలు నాటాలంటూ అభిమానులను సైతం ప్రోత్సహించేవాడు.
previous post
దిశ ఘటనపై పవన్ వ్యాఖ్యలు వక్రీకరణ… కుహనా మేధావులు అంటూ నాగబాబు సమాధానం