నగరి ఎమ్మెల్యే రోజా ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’లో భాగంగా పలువురు సినీ నటులతో మొక్కలు నాటిస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా జబర్దస్త్ యాంకర్ రష్మీతో ఆమె మొక్క నాటించారు. ఇందుకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. రష్మీ మొక్క నాటుతుండగా రోజా పలు సూచనలు చేశారు. ఈ చాలెంజ్ స్ఫూర్తిగా అందరూ మొక్కలు నాటాలని రష్మీ పిలుపునిచ్చింది. రోజా తనకు చాలెంజ్ విసిరారని, దీంతో మొక్క నాటానని చెప్పింది. ట్రీస్ అనేవి చాలా ముఖ్యం. మానవునికి కావాల్సిన ప్రాణ వాయువైన ఆక్సిజన్‌ను ఇచ్చి కార్బన్ డైఆక్సైడ్ ను పీల్చుకుంటాయి. అంతే కాక పరిసరాలలో వున్న కుళ్ళు వాసనలను, కలుషితమైన గాలిని గ్రహించుకొని స్వచ్చపరుస్తాయి.రోజురోజుకు పెరుగుతున్న ఎండ తీవ్రతను, వాతావరణలో హెచ్చుతగ్గులను సమతుల్యత చేయడానికి మొక్కలు తప్పకుండా పెంచాలనీ పేర్కోంది. యాంకర్ అనసూయ, యాక్టర్ సత్యదేవ్, శేఖర్ మాస్టర్‌లను ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ని స్వీకరించాలి అని కోరింది.
previous post