telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

కరెంటు బిల్లుతో .. ప్రభుత్వ పథకాల లింక్.. పెరిగితే అంతే..

navaratnalu

ఏపీ ప్రభుత్వం పెన్షన్, రేషన్ కార్డులను తొలగించడానికి, కొత్తవి మంజూరు చేయడానికి కరెంట్ బిల్లులను లింక్ పెట్టడంతో పెన్షనర్లకు, రేషన్ కార్డు వినియోగదారులకు నిద్ర పట్టనివ్వట్లేదు. 200 యూనిట్లు దాటితే రేషన్.. 300 యూనిట్లు దాటితే పెన్షన్ కట్ చేసేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక ఈ విషయాలన్నీ గ్రామ వాలంటీర్లు ఎప్పటికప్పుడు ఆరా తీస్తుంటారు. భార్యాభర్తల ఇద్దరి పేరు మీద ఉన్న ఆధార్ కార్డుతో అనుసంధానమైన అన్ని సర్వీసులను కలిపి ఒక యూనిట్‌గా… గృహ, వాణిజ్య, వ్యాపార, పారిశ్రామిక సర్వీసులన్నింటిని కలిపి ఒక యూనిట్‌గా అధికారులు పరిగణించనున్నారు. ఈ నిబంధనల ద్వారా బీ ఫారాల్లో ఉన్న ఇళ్లు, స్వాధీనాల్లో ఉన్న ఇళ్లు, రోడ్ల పక్కన ఆక్రమించుకుని ఉంటున్న వాళ్ళు ఈ లిస్ట్‌లో చేరతారని తెలుస్తోంది. దీని ద్వారా ఇకపై విద్యుత్ సంస్థలు ఆయా ఇళ్లల్లో ఉంటున్న వాళ్ళ పేర్ల మీదే సర్వీసులు మంజూరు చేస్తారు.

ఇళ్లు అమ్ముకున్న వాళ్లకు.. ఇంటిని వేరే వాళ్లకు అద్దెకి ఇచ్చి పొరుగూరిలో ఉంటున్న వారికి కూడా ఇబ్బందులు తప్పవని విద్యుత్ అధికారులు చెబుతున్నారు. అద్దెకు ఉంటున్న వాళ్ళు ఎక్కువ కరెంటు ఉపయోగించినా.. అది ఓనర్ల మీదే భారం పడుతుందని అంటున్నారు. సొంతిళ్లు అద్దె ఇచ్చి స్థాయిలో ఉన్నప్పుడు వాళ్లకు పెన్షన్ ఎందుకని అధికారులు వాదిస్తున్నారు. ఆహార భద్రత నియమాల్లో సవరణలు చెయ్యాలని ఏపీ ప్రభుత్వం భావించి.. అర్హులు కాని వాళ్ళను తొలగించడానికి కొత్త సవరణలు చేసి తాజాగా ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అందులో భాగంగా టాక్సీ, ట్రాక్టర్, ఆటోలు తప్పితే మరే ఫోర్ వీలర్ అయినా లబ్దిదారులకు ఉంటే.. వారికి రేషన్ లేనట్లే.

Related posts