ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు ఆయా దేశాలు పకడ్బంధీ చర్యలు తీసుకుంటున్నారు. అయినపట్టికీ కోవిడ్-19 ఇటలీని మాత్రం అతలాకుతలం చేస్తుంది. కేవలం 24 గంటల వ్యవధిలోనే ఇక్కడ ఏకంగా 475 మంది ఈ మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయారు. చైనాలో కూడా ఈ స్థాయిలో మరణాలు నమోదు కాకపోవడం గమనార్హం. దీనిని బట్టి ఇటలీలో కరోనా వైరస్ ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
తాజా మరణాలతో కలిపి ఇటలీలో ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 2,978కి చేరుకుంది. కోవిడ్-19 కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 8 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. కరోనా వైరస్ నిర్ధారిత కేసుల సంఖ్య 2 లక్షలు దాటింది. మరోవైపు, కరోనా వైరస్‌పై చైనా కీలక ప్రకటన చేసింది. ఈ వైరస్ వెలుగు చూసిన వూహాన్‌లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని ప్రకటించింది. దేశంలో ఎవరికీ కొత్తగా కరోనా సోకలేదని వివరించింది.
ఏపీకి వచ్చే పరిశ్రమలు తరలిపోతున్నాయి: ఎమ్మెల్సీ మాధవ్