సమాజ్‌వాదీ పార్టీ నేత పీయూష్ జైన్ ఇంట్లో ఐటీ దాడులు నిర్వహించారు. అక్కడ కనిపించిన నోట్ల కట్టలు చూసి అధికారులు షాకయ్యారు. గుట్టలుగుట్టలుగా ఉన్న నోట్ల కట్టలని లెక్కించగా రూ.150కోట్లకు పైనే తేలింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో చోటుచేసుకుంది.
అంతేకాకుండా అనుమానస్పదంగా కన్పించిన రెండు అల్మారాలను తెరిచి చూడగా కట్టలు కట్టలుగా బయటపడ్డ నోట్లను చూసి ఆశ్చర్యపోయారు.వాటిని స్వాధీనం చేసుకున్న అధికారులు.. పీయూష్ ఇంట్లోనే కుప్పలుగా పోసి లెక్కించారు.
ఈ సొమ్మును నకిలీ ఇన్‌వాయిస్‌లు, ఈవే బిల్లులు లేకుండా రవాణా చేసిన సరకుకు సంబంధించినదిగా అధికారులు గుర్తించారు. గురువారం దాడులు నిర్వహించిన అధికారులు శుక్రవారం ఉదయం వరకు లెక్కించి ఆ డబ్బు విలువను రూ.150 కోట్లుగా తేల్చారు..
ఇటీవల సమాజ్‌వాదీ సెంట్ పేరుతో రూపొందించిన సుగంధ ద్రవ్యాన్ని ఈయన కంపెనీలోనే తయారు చేశారు. ఈ కేసుకు సంబంధించి కాన్పుర్ సహా ఉత్తరప్రదేశ్‌లోని పలు ప్రాంతాలు, గుజరాత్, ముంబయిల్లో కూడా అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు
మరో నాలుగు నెలల్లో ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలు జరగనున్న వేళ సమాజ్‌వాదీ పార్టీతో సంబంధం ఉన్న నేత ఇంట్లో భారీగా డబ్బులు బయటపడడం సంచలనంగా మారింది.
తాను ఏ విచారణకైనా సిద్ధం: చింతమనేని