telugu navyamedia
సినిమా వార్తలు

‘బంగార్రాజు’ షూటింగ్‌ పూర్తి..

అక్కినేని నాగార్జున, నాగ చైతన్య ప్రధాన పాత్రలో డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ తెరకెక్కిస్తున్న మూవీ ‘బంగార్రాజు’ . ‘సోగ్గాడు మళ్లీ వచ్చాడు’ అనేది సినిమా క్యాప‍్షన్‌. 2016లో వచ్చిన ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమాకు సీక్వెల్‏గా ఈ మూవీ తెరకెక్కుతోంది.

బంగార్రాజులో నార్జున‌కు జోడిగా ర‌మ్య‌కృష్ణ‌, చైకి జోడిగా ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, టీజర్‌ ఆకట్టుకుంటున్నాయి.

Bangarraju: Makers unveil a glimpse of third lyrical video features Faria  Abdulla, Akkineni Nagarjuna and Naga Chaitanya | Telugu Movie News - Times  of India

తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్‌డేట్‌ వచ్చింది. బంగార్రాజు సినిమా షూటింగ్‌ గురువారంతో (డిసెంబర్‌ 23) పూర్తయింది. అన్నపూర్ణ స్టూడియోలో వేసిన భారీ సెట్‌లో నాగ చైతన్య, కృతీ శెట్టిలపై తీసిన పెప్పీ మాస్‌ సాంగ్‌తో చిత్రీకరణ ముగిసింది.

Image

ఈ విషయాన్ని నాగార్జున తన ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. “షూట్ చివరి రోజు ఇది !! మరొక పెప్పీ డ్యాన్స్ నంబర్ రెడీ అవుతోంది” పండగలాంటి సినిమా. ‘బంగార్రాజు’ కమింగ్‌ సూన్‌’’ అంటూ నాగార్జున ఆ సాంగ్ కు సంబంధించిన ఫోటో ను షేర్ చేశారు. ఇందులో నాగ చైతన్య ఎరుపు రంగు సిల్క్ కుర్తాలో ఉండగా, నటి కృతి శెట్టి చీరలో అందంగా కన్పిస్తోంది.

ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించగా అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. సంక్రాంతి కానుగా వచ్చే ఏడాది జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది

Related posts