మాజీ సీఎం కేసీఆర్ స్ఫూర్తితో గ్రీన్ చాలెంజ్ ప్రారంభించానని, దీనిని నా జీవితాంతం కొనసాగిస్తానని మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్ తెలిపారు.
8వ విడత గ్రీన్ చాలెంజ్‌ను ఆయన ఆదివారం మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కీసరగుట్టలో స్థానిక ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డితో కలిసి మొక్కలు నాటి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏడేళ్లుగా రాజకీయాలకు అతీతంగా రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులే, కవులు, కళాకారులు, సామాన్యులను ప్రతి ఒక్కరినీ ఇందులో భాగస్వాములను చేశామని చెప్పారు.
ఇప్పటివరకు 20 కోట్ల మొక్కలు నాటినట్లు పేర్కొన్నారు.

