గతంలో విడుదలై ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ ను సంపాదించుకున్న యానిమేషన్ మూవీ “ద లయన్ కింగ్”. డిస్ని సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా అన్ని భాషల్లో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాను తెలుగులో కూడా భారీ స్థాయిలో విడుదల చేయడానికి సన్నద్ధమవుతున్నారు. అందుకే డిస్నీ సంస్థ “లయన్ కింగ్” సినిమా కోసం తెలుగులో ప్రముఖ నటీనటులతో జంతువులకు డబ్బింగ్ చెప్పించింది. “లయన్ కింగ్”లో సింహం పేరు సింబా. అలాగే స్కార్, ముఫాసా అనే రెండు సింహాలు, పుంబా అనే అడవి పంది, టీమోన్ అనే ముంగిస ఈ చిత్రంలో మిగిలిన కీలక పాత్రలు. కార్టూన్ నెట్‌వర్క్‌లో కామిక్ సీరియల్‌గా మొదలైన “లయన్ కింగ్”ను ఆ తరువాత డిస్నీ సంస్థ 2డి యానిమేషన్ ఫిల్మ్‌గా 1990లో విడుదల చేశారు. అప్పట్లో సూపర్‌హిట్ అయిన ఆ చిత్రాన్ని ఇప్పుడు 3డి యానిమేషన్ టెక్నాలజీతో, కంప్యూటర్ గ్రాఫిక్స్ ఉపయోగించి ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా అన్ని ముఖ్య భాషల్లో వచ్చే నెల 19న “లయన్‌కింగ్” చిత్రం విడుదలవుతుంది.
ఈ చిత్రంలో అతి కీలకమైన ముఫాసా పాత్రకి హిందీలో షారుఖ్ ఖాన్, తెలుగు, తమిళంలో పి.రవిశంకర్ డబ్బింగ్ చెప్పారు. అలాగే లయన్ కింగ్‌లో హీరో సింబా పాత్రకి హిందీలో షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డబ్బింగ్ చెప్పగా, తెలుగులో నేచురల్ స్టార్ నాని చెప్పారు. అలాగే తమిళంలో హీరో సిద్దార్థ చెప్పారు. ఇక విలన్ పాత్రధారి స్కార్ పాత్రకి బాలీవుడ్‌లో ఆశీష్ విద్యార్థి చెప్పగా, తెలుగులో వెర్సటైల్ ఆర్టిస్ట్ జగపతి బాబు డబ్బింగ్ చెప్పారు. తమిళంలో అరవింద్ స్వామి డబ్బింగ్ చెప్పారు. టైమన్ పాత్రకి బాలీవుడ్ నుండి శ్రేయాస్ తాల్‌పడే చెప్పగా తెలుగులో కమెడియన్ ఆలీ, తమిళంలో సింగం పులి డబ్బింగ్ చెప్పారు. అలాగే మరో కామెడీ పాత్ర అయిన పుంబ పాత్రకి బాలీవుడ్‌లో సంజయ్ మిశ్రా, తెలుగులో ప్రముఖ హస్యనటుడు బ్రహ్మానందం, తమిళంలో రోబో శంకర్‌లు డబ్బింగ్ చెప్పారు. ఇంకా ఇతర పాత్రలకి ప్రముఖులతో డబ్బింగ్ చెప్పించి బాలీవుడ్, టాలీవుడ్, కొలీవుడ్‌ల నేటివిటికి దగ్గరగా ఇక్కడి ప్రేక్షకుల హృదయాలకి దగ్గరయ్యేలా డిస్నీ నిర్ణయం తీసుకుంది. కార్యక్రమాలన్నీ పూర్తి చేసి జూలై 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.
Presenting the BIGGEST Industry legends & youth icons as the voice cast for Hindi, Tamil, Telugu and English versions #TheLionKing July 19th
Hindi – https://t.co/jcOVYa4o8a
Telugu – https://t.co/dOjUyIndov
Tamil – https://t.co/pQi7Z3tOPP
English – https://t.co/Tx5f4gAlSP pic.twitter.com/TXtlPWx9iw— BARaju (@baraju_SuperHit) July 5, 2019


