telugu navyamedia
క్రీడలు వార్తలు

సౌత్ ఆఫ్రికా ముందు భారీ లక్ష్యం ఉంచిన భారత అమ్మాయిలు…

కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ తర్వాత భారత మహిళల జట్టు మొదటి ద్వైపాక్షిక సిటీస్ ను సౌత్ ఆఫ్రికాతో ఆడుతుంది. అయితే ఈ వన్డే సిరీస్ లో భాగంగా ఈరోజు జరుగుతున్న నాలుగో వన్డే లో సౌత్ ఆఫ్రికా అమ్మాయిలను ఉతికారేసారు భారత మహిళలు. ఈ మ్యాచ్ లో 25 ఓవర్ల వరకు 100 పరుగులు కూడా చేయని భారత జట్టు తమ ఇన్నింగ్స్ ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 266 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో పునం రౌత్(104) సెంచరీతో చెలరేగిపోగా హర్మన్‌ప్రీత్ కౌర్ అర్ధశతకంతో రాణించింది. వీరికి తోడుగా కెప్టెన్ మిథాలీ రాజ్ 45 పరుగులు చేసి ఆకట్టుకుంది. అయితే ఈ క్రమంలో మహిళా వన్డే ఫార్మటు లో 7000 పరుగులు చేసిన మొట్ట మొదటి మహిళా క్రికెటర్ గా రికార్డు నెలకొల్పింది. అయితే 5 వన్డే ల ఈ సిరీస్ లో ఇప్పటివరకు జరిగిన మూడు మ్యాచ్ లో 2-1 తో సౌత్ ఆఫ్రికా ఆధిక్యంలో ఉండగా ఈ మ్యాచ్ లో ఎలాగైనా విజయం సాధించి సిరీస్ సమం చేయాలనీ భారత్ భావిస్తుంది. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.

Related posts