telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

క్షేత్రస్థాయిలో నెలకొన్న సమస్యలను వేగవంతంగా పరిష్కరించేందుకు వార్డు వ్యవస్థ – మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

క్షేత్రస్థాయిలో నెలకొన్న సమస్యలను వేగవంతంగా పరిష్కరించేందుకు వార్డు వ్యవస్థను అందుబాటులోకి తెచ్చామని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో వార్డు కార్యాలయం పనితీరు పై నిర్వహించిన సమావేశంలో నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి, ఎమ్మెల్సీ ప్రభాకర్, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్ లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నగర వ్యాప్తంగా విస్తృతంగా మౌలిక సదుపాయాలను పౌరులకు అందిస్తున్నామని తెలిపారు. క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలు అన్ని శాఖల సమన్వయంతో పరిష్కరించేందుకు పది మంది అధికారుల బృందంతో వార్డు కార్యాలయం ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రజా సమస్యల పై అధికారులు కో-ఆర్డినేషన్ తో పని చేసి సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేస్తారని తెలిపారు. ఇప్పటికే జిహెచ్ఎంసిలో 6 జోనల్ కార్యాలయాలు, 30 సర్కిల్ కార్యాలయాలు ఉండగా అదనంగా 150 వార్డు కార్యాలయాలు ప్రజలకు సేవ చేయనున్నాయని తెలిపారు. నగరంలో వాణిజ్య పరంగా అభివృద్ధి చెందిందని అందుకు తగ్గట్టు మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. యు.బి.డి ద్వారా గ్రీన్ కవర్ పెంచడానికి వార్డు వ్యవస్థ పనిచేస్తుందన్నారు.
ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, జలమండలి, శానిటేషన్, ఎంటమాలజీ, విద్యుత్ ఇక పై సమిష్టిగా పనిచేయనున్నాయి అని తెలిపారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ ప్రచార మాధ్యమాల ద్వారా వార్డు కార్యాలయం పనితీరు పై నగర వాసులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని తెలిపారు. రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి ముందు చూపుతో దేశంలో ఎక్కడా లేని విధంగా మూడంచెల వ్యవస్థను అయిన జోన్, సర్కిల్, వార్డు వ్యవస్థను అమలు చేస్తున్నారని తెలిపారు.
శుక్రవారం ఒక్క రోజే 132 వార్డు కార్యాలయాలను  ప్రారంభించగా మిగతా 18 కార్యాలయాలను త్వరలో ప్రారంభోత్సవం చేస్తామని తెలిపారు. వార్డు వ్యవస్థ పనితీరు పై ఆరు నెలల తర్వాత రివ్యూ చేస్తామని తెలిపారు.  జిహెచ్ఎంసి లో వేల కోట్ల రూపాయలతో ఎస్.ఆర్.డి.పి, ఎస్.ఎన్.డి.పి ద్వారా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. జిహెచ్ఎంసి ద్వారా శానిటేషన్, వెటర్నరీ, ఎంటమాలజి, హెల్త్, విద్యుత్, లేక్స్, హౌసింగ్ (2BHK), టౌన్ ప్లానింగ్, యు.సి.డి, స్పోర్ట్స్, డి.ఆర్.ఎఫ్, యు.బి.డి, ప్రాపర్టీ టాక్స్, ఫైనాన్స్ వంటి పలు అభివృద్ధి పనులను ప్రజలకు అందిస్తున్నామని తెలిపారు.

Related posts