భారతీయ సినిమా ఇండస్ట్రీలో “మీటూ” ఉద్యమం వల్ల జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇందులో భాగంగా మంచి ముసుగులో ఉన్న ఎంతోమంది ప్రముఖుల నిజ స్వరూపాలు బట్టబయలయ్యాయి. చాలామంది నటీమణులు తమకు ఎదురైన చేదు అనుభవాలను “మీటూ” కారణంగా ధైర్యంగా బయటపెట్టారు. అయితే బాలీవుడ్‌లో మీటూ ఉద్యమం ప్రారంభమైనప్పుడు ప్రముఖ దర్శకుడు సాజిద్ ఖాన్ పేరు బాగా విన్పించింది. ఎంతో మంది యువతులు సాజిద్‌పై ఆరోపణలు చేశారు. తాజాగా మోడల్ పౌలా కూడా సాజిద్‌పై ఆరోపణలు చేసింది. ‘హౌస్‌ఫుల్’ సినిమాలో పాత్ర కోసం వెళ్లినపుడు సాజిద్ తనను లైంగికంగా వేధించాడంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేసింది. “మీటూ ఉద్యమం ప్రారంభమైనపుడు సాజిద్ ఖాన్‌పై చాలా మంది ఆరోపణలు చేశారు. కానీ నాకు ధైర్యం సరిపోలేదు. కుటుంబం కోసం సంపాదించాల్సిన అవసరం ఉండడంతో నేను నిశ్శబ్దంగా ఉండిపోయాను. ఇప్పుడు నా పేరెంట్స్ నాతో లేరు. అందుకే ధైర్యంగా చెబుతున్నా. నాకు 17 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు సాజిద్ నన్ను లైంగికంగా వేధించాడు. నాతో అసభ్యంగా మాట్లాడేవాడు. నన్ను తాకడానికి ప్రయత్నించేవాడు. తన ముందు బట్టలు విప్పమని ఒకసారి నన్ను అడిగాడు. ఇలాంటి నీచులు కటకటాల వెనుక ఉండాలి. కేవలం కాస్టింగ్ కౌచ్‌కు మాత్రమే కాదు.. ఇతరులను మాయ చేసి వారి కలలను చిదిమేసినందుకు ఆయన శిక్ష అనుభవించాలి. ఆయన నిజస్వరూపాన్ని ఇన్నాళ్లూ బయటపెట్టకపోవడమే నేను చేసిన తప్పు” అంటూ పౌలా పోస్ట్ చేసింది.
View this post on Instagram
🙏🏼 Before democracy dies and there is no freedom of speech anymore I thought I should speak !