నిన్న పాక్ విమానాలకు ధీటుగా సమాధానం చెప్పిన ఐఏఎఫ్ ఫైలట్ అభినందన్ క్షేమంగా రావాలని యావత్ భారత్ కోరుకుంటోంది. ఆయన ఆరోగ్యంతో తిరిగిరావాలని మనసారా ఆకాంక్షిస్తున్నారు. ఆలయాలు, మసీదు, చర్చిల్లో .. సర్వ మత ప్రార్థనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, నిన్న పాక్ కబంధహస్తాలలో చిక్కుకున్న పైలెట్ అభినందన్ క్షేమంగా ఉన్నారని ఆయన తండ్రి వర్ధమాన్ తెలిపారు. దేవుడి దయ వల్ల అభినందన్ బతికి ఉన్నారని పేర్కొన్నారు. స్పృహలో ఉన్నారని .. గాయాలేమి కాలేదని గుర్తుచేశారు. ‘అభినందన్ నిజమైన సైనికుడు, పాక్ సైనికుల బంధీగా ఉన్న ఆయన చూపిస్తోన్న ధైర్య సాహసాలు అభినందనీయం, మేం నిన్ను చూసి గర్వపడుతున్నాం’ అని మీడియాకు తెలిపారు.
అభినందన్ క్షేమంగా తిరిగి రావాలని ఓ తండ్రిగా, రిటైర్డ్ ఎయిర్ మార్షల్ గా కోరుకుంటున్నానని చెప్పారు. ‘పాక్ సైనికులు అభినందన్ ను వేధింపులకు గురిచేయొద్దని ఆ భగవంతుడిని కోరుకుంటున్నా, స్పృహలోనే క్షేమంగా ఇంటికి రావాలని అభిలాషిస్తున్నా, అభినందన్ కోసం దేశవ్యాప్తంగా ప్రజలు కోరుకోవడాన్ని స్వాగతించారు. అభినందన్ క్షేమంగా తిరిగి రావాలని ప్రార్థనలు చేయడంతో వారికి ధన్యవాదాలు తెలిపారు. అభినందన్ ను విడిపించాలనే మీ ఆకాంక్ష మాకు మరింత శక్తి, సామర్థ్యాలను ఇస్తున్నాయని ప్రశంసించారు.
ప్రజావేదిక కూల్చివేత కక్షసాధింపు చర్యే: బుద్దా వెంకన్న