telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఉగ్రవాదులుగా హింసకు పాల్పడుతుంది.. తమిళ హిందువులే.. : పాక్ పీఎం ఇమ్రాన్

imran on terrorism in UN

భారత్‌పై ఐక్యరాజ్యసమితి వేదికగా పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ మరోసారి తన అక్కసును వెళ్లగక్కారు. కశ్మీర్‌ అంశాన్ని మళ్ళీ లేవనెత్తారు. కశ్మీర్‌లో కర్ఫ్యూ విధించి ప్రజల్ని బంధీలను చేశారని ఆరోపించారు. ఒక్కసారి కర్ఫ్యూ ఎత్తివేస్తే జరిగేది రక్తపాతమేనని హెచ్చరించారు. ఒకవేళ యుద్ధమంటూ వస్తే తాము చూస్తూ ఊరుకోబోమని, చివరి వరకు పోరడతామన్నారు. అణ్వస్త్రాలు కలిగిన దేశాల మధ్య యుద్ధం వస్తే అది రెండు దేశాలకే పరిమితం కాదన్నారు. ఈ పరిస్థితి రాకుండా చూడాల్సింది ఐరాసనే అని ఇమ్రాన్‌ అన్నారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ఇమ్రాన్‌ ఖాన్‌ సుదీర్ఘంగా ప్రసంగించారు. భారత్‌పై తన అక్కసు వెళ్లగక్కుతూనే ఇస్లామిక్‌ వాదాన్ని లేవనెత్తారు.

ప్రపంచ వ్యాప్తంగా ఇస్లామిక్‌ ఫోబియా పెరుగుతోంది. సెప్టెంబర్ 9/11 దాడుల తర్వాత ఇది పెరిగింది. కొందరు నేతలు ఉగ్రవాదాన్ని ముస్లిం మతంతో ముడిపెట్టారు. మతానికి టెర్రరిజానికి సంబంధం లేదు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు ముస్లింలను అతివాదులుగా ముద్రవేశాయి. ముస్లింలను ఆత్మాహుతి దళ సభ్యులుగా ముద్రవేస్తున్నారు. సెప్టెంబర్‌ 11 దాడులకు ముందు ఆత్మాహుతి దాడులు చేసేవారు తమిళ హిందువులే. ఆ రోజుల్లో హిందువులపై ఎవరూ ఉగ్రవాదులగా ముద్రవేయలేదు. సెప్టెంబర్‌ 11 దాడుల్లో మేం పాల్గొనకపోయినా 70 వేల మంది పాకిస్థానీయులు చనిపోయారని ఇమ్రాన్‌ అన్నారు.

Related posts