telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్

వ్యాధులకు దూరంగా ఉండాలంటే.. రోగనిరోధక శక్తి .. చాలా ముఖ్యం తెలుసా..!

immunity is necessary for balanced health

మానవ శరీరంలో వివిధ అవయవాలు సక్రమంగా పనిచేయాలంటే సరైన ఆహారం మరియు ఆరోగ్యం అవసరం. అన్ని అవయవాలు ఆరోగ్యంగా ఉండాలంటే రోగనిరోదక శక్తి అవసరం. మంచి రోగనిరోదక శక్తి ఉంటే వ్యాధులు వచ్చే ప్రమాదం తక్కువ. మన శరీరంలో విషాలను బయటకు పంపటానికి మరియు వ్యాధుల మీద పోరాటం తెల్ల రక్త కణాలు చేస్తాయి. అందువల్ల మన శరీరంలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండాలి. మన శరీరంలో జరిగే విధులకు రోగనిరోదక శక్తితో సంబంధం ఉంది. అందువలన రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాల గురించి తెలుసుకుందాం.

immunity is necessary for balanced health * పెరుగుమన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగాలంటే ప్రోబయోటిక్స్ ఉన్న ఆహారాలను తీసుకోవాలి. పెరుగులో ప్రోబయోటిక్స్ సమృద్దిగా లభిస్తుంది. పెరుగు అనేక వ్యాధుల లక్షణాలను మరియు మంటను తగ్గిస్తుంది. ప్రతి రోజు ఒక కప్పు పెరుగు తీసుకుంటే రోగనిరోదక శక్తి పెరుగుతుంది. అలాగే పెరుగు మంచి రుచి రావటం కొరకు స్ట్రాబెర్రీని కలపవచ్చు.

* గ్రీన్ టీగ్రీన్ టీని ఒక సూపర్ ఆహారం అని చెప్పవచ్చు. ఎందుకంటే శరీరంలో ప్రతి అవయవం పనితీరు బాగుండేలా రోగనిరోదక శక్తిని పెంచుతుంది. గ్రీన్ టీలో రోగనిరోదక శక్తిని పెంచటానికి యాంటీఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉంటాయి. వేడి నీటిలో గ్రీన్ టీ ని వేసి రెండు నిముషాలు అయ్యాక వడకట్టి త్రాగాలి. చేదు ఇష్టం లేనివారు గ్రీన్ టీలో నిమ్మరసం, తేనే కలుపుకోవచ్చు. ప్రతి రోజూ రెండు కప్పుల గ్రీన్ టీని త్రాగాలి.

* విటమిన్ డివిటమిన్ డి రోగనిరోదక శక్తిని పెంచటంలో సహాయపడుతుంది. విటమిన్ డి ఉన్న ఆహారాలను తీసుకుంటే బలంగా ఉండటమే కాక మంచి రోగనిరోదక వ్యవస్థ ఏర్పడుతుంది. విటమిన్ డి సాదారణంగా సూర్య కిరణాల నుండి లభిస్తుంది. అలాగే సాల్మన్ చేపలు మరియు బలవర్థకమైన పాలలో కూడా విటమిన్ డి లభిస్తుంది.

green tea* పుట్టగొడుగులలో విటమిన్ బి, ప్రోటీన్, ఫైబర్, విటమిన్ సి, కాల్షియం మరియు ఇతర ఖనిజాలు ఉండుట వలన రోగనిరోదక శక్తిని పెంచుతాయి. వివిధ విధానాల ద్వారా రోగనిరోదక శక్తిని మెరుగుపరుస్తూ, యాంటి ఇన్ ఫెక్షన్ కార్యకలాపాల కోసం తెల్ల రక్త కణాలను ఉత్తేజపరుస్తుంది. రోగనిరోదక శక్తి పెరగాలంటే ప్రతి రోజు ఒక కప్పు పుట్టగొడుగులను ఆహారంలో చేర్చుకోవాలి.

* చికెన్ సూప్ రోగనిరోదక వ్యవస్థను పెంచటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. దీనిలో వ్యాధుల లక్షణాలను తగ్గించటానికి రోగ నిరోధక శక్తిని పెంచే లక్షణాలు ఉన్నాయి. ప్రతి రోజు ఒక కప్పు చికెన్ సూప్ త్రాగాలి. ఇంకా మంచి పలితం కోసం ఈ సూప్ లో వెల్లుల్లిని కలపాలి.

Related posts