ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అస్వస్థతకు గురయ్యారు. ఆయన గత నాలుగు రోజులుగా వైరల్ జ్వరం, దగ్గుతో బాధపడుతున్నారు.
దీనిపై రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. పవన్ కల్యాణ్ త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆకాంక్షించారు.
అంతేకాకుండా, ‘ఓజీ’ చిత్రం విజయం సాధించడంపైనా తన అభినందనలు తెలియజేశారు.
పవన్ కల్యాణ్ త్వరగా శక్తిని పుంజుకుని, పూర్తి ఆరోగ్యవంతులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు లోకేశ్ పేర్కొన్నారు. “ఆంధ్రప్రదేశ్‌కు మీ సేవలను కొనసాగిస్తూ మాకు స్ఫూర్తినివ్వాలి.
అలాగే, మీ అభిమానులు, శ్రేయోభిలాషులతో కలిసి ‘ఓజీ’ సినిమా అద్భుత విజయాన్ని మీరు జరుపుకోవాలి” అని లోకేశ్ తన సందేశంలో పేర్కొన్నారు.