telugu navyamedia
క్రీడలు వార్తలు

అరుదైన ఘనత సొంతం చేసుకున్న శుభ్‌మన్ గిల్…

టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్‌లో హాఫ్ సెంచరీ సాధించిన గిల్.. ఆసీస్ గడ్డపై 50 ప్లస్ స్కోర్ చేసిన అత్యంత పిన్న ఓపెనర్‌గా గుర్తింపుపొందాడు. ఆసియా బయట హాఫ్ సెంచరీ చేసిన యంగెస్ట్ ఓపెనర్ల జాబితాలో శుభ్‌మన్ నాలుగో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి అగ్రస్థానంలో ఉండగా.. మహదేవ్ అప్టే, పృథ్వీ షా, శుభ్‌మన్ తరువాతి స్థానంలో ఉన్నారు. 20 ఏళ్ల 44 రోజుల వయసులో రవిశాస్త్రి ఇంగ్లండ్‌పై 50కిపైగా పరుగులు చేయగా.. శుభ్‌మన్ 21 ఏళ్ల 122 రోజుల వయసుతో ఆసీస్‌పై హాఫ్ సెంచరీ చేసి నాలుగో స్థానంలో నిలిచాడు. భీకరమైన బౌలింగ్‌ను అద్భుతంగా ఎదుర్కొన్న శుభ్‌మన్ 100 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. నాథన్ లయన్ బౌలింగ్‌లో సింగిల్ తీసి సంప్రదాయక ఫార్మాట్‌లో తొలి హాఫ్ సెంచరీ సాధించాడు. అయితే ఆ ఆనందం అతినికి ఎంతోసేపు నిలవలేదు. కమిన్స్ బౌలింగ్‌లో గల్లీలో డ్రైవ్ షాట్ ఆడబోయిన గిల్.. కామెరూన్ గ్రీన్‌కు చిక్కి పెవిలియన్ చేరాడు.

Related posts