ప్రతిష్టాత్మక సదస్సుకు ఉస్మానియా యూనివర్సిటీ సివిల్ ఇంజినీరింగ్ విభాగం వేదికగా నిలిచింది. దీనికి సంబంధించిన వివరాలను విలేకరుల సమావేశంలో విభాగం హెడ్, సదస్సు చైర్మన్ ప్రొఫెసర్ గోపాల్‌నాయక్ వెల్లడించారు. హైడ్రాలిక్స్, వాటర్ రిసోర్సెస్ అండ్ కోస్టల్ ఇంజినీరింగ్‌పై 24వ అంతర్జాతీయ సదస్సును హైడ్రో-2019ను ఇండియన్ సొసైటీ ఆఫ్ హైడ్రాలిక్స్(ఐఎస్‌హెచ్), సివిల్ ఇంజినీరింగ్ విభాగం సంయుక్తంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 1992లో ప్రారంభమైన ఈ హైడ్రో సదస్సు హైదరాబాద్‌లో జరగడం ఇదే మొదటిసారన్నారు. హైడ్రోరంగంలో నూతన విధానాలు, ఆవిష్కరణలను ప్రతీ ఏటా ఈ సదస్సులో చర్చిస్తారని పేర్కొన్నారు.
సదస్సులో దేశవిదేశాల నుంచి నిపుణులు తమ పరిశోధనాపత్రాలను సమర్పిస్తారన్నారు. వారిచ్చే సూచనలు నీటిపారుదల రంగంలో ప్రత్యేకించి తెలంగాణ రాష్ర్టానికి ఎంతో ఉపయుక్తమని అభిప్రాయపడ్డారు. సదస్సులో సమర్పించేందుకు ైక్లెమేట్ చేంజ్, వాటర్ మోడలింగ్, ఫ్లడ్, డ్రాట్ మేనేజ్మెంట్, గ్రౌండ్ వాటర్ హైడ్రాలజీ, పోర్ట్స్, హార్బర్ ఇంజినీరింగ్, కోస్టల్ ఇంజినీరింగ్, వాటర్ మేనేజ్మెంట్, హైడ్రో ఇన్ఫర్మేటిక్స్, జీఐఎస్ అప్లికేషన్స్ తదితర రంగాల్లో దాదాపు 505 పరిశోధనా పత్రాలు అందాయని, వాటిలో 350 పత్రాలను ఆమోదించినట్లు వివరించారు. దాదాపు 50 పరిశోధనా పత్రాలు విదేశీవి ఉండడం విశేషమన్నారు.
జగన్ ఇంగ్లీషులో మాట్లాడితే జాతీయ ఛానళ్లే ఆశ్చర్యపోతాయి: డిప్యూటీ సీఎం అంజాద్